Indiramma Housing App: ఇందిరమ్మ ఇళ్ల యాప్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను సేకరించారు.
CM Revanth Reddy: నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగ విజయోత్సవ భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రశంగించనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. HYDRA :…
CM Revanth Reddy: ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ..…
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం పేదల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించే లక్ష్యంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చొరవ కింద, నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దీంతో ఈ కుటుంబాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఇళ్లలో…
సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Revanth Reddy: నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం బేగంపేట నుంచి హెలికాప్టర్లో సిద్ధిపేటకు వెళ్లనున్నారు.
గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.