సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేస్తూ.. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించం.. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Maharashtra: ఫోన్ కొనేందుకు నిరాకరించిన తల్లి.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..
ఈరోజు అల్లు అర్జున్ ఇంటిని ఓయూ జేఏసీ ముట్టడించిన సంగతి తెలిసిందే.. ఇంటిపై టమాటాలు, రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో.. ఇంట్లో పూల కుండీలు ధ్వంసమయ్యాయి. కాగా.. విషయం తెలుసుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఇంట్లో అల్లు అర్జు్న్ లేరు. దాడి అనంతరం.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని సెక్యురిటీ నుంచి వివరాలను అడిగితెలుసుకున్నారు.
Read Also: Rahul Gandhi: కుటుంబంతో రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ..
ఈ రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ గురించి సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. ఒక లక్ష పై చిలుకు పోలీసుల కుటుంబాలు ఉన్నాయి.. ఒక్క బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి.. అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. ఒక్క పోలీసు అధికారి కూడా నీ దగ్గరకి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావో ఆలోచించుకో అని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఊరుకోరని విష్ణుమూర్తి హెచ్చరించారు.
సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.
సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు…
— Revanth Reddy (@revanth_anumula) December 22, 2024