CM Revanth Reddy: సినీ ప్రముఖుల భేటీలో హీరోలు అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? అన్నారు సీఎం. హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుండి తెలుసన్నారు. వారిద్దరూ నాతో కలిసి తిరిగిన వారే అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం వ్యవహరించాలి అనేది నా విధానం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని తెలిపారు.
Read also: Dil Raju: తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే మా లక్ష్యం..
కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్నారు. సినిమా పరిశ్రమ పెద్దల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశమని సీఎం తెలిపారు. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలన్నారు. సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయన్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశమని రేవంత్ అన్నారు.
Read also: Telangana DGP: పోలీసులు వద్దంటే వినాలి.. సినీ ప్రముఖులతో డీజీపీ..
ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది.. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవన్నారు. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని సీఎం సూచించారు. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నామన్నారు. ఐటీ, ఫార్మా తో మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమని తెలిపారు.
Read also: Tollywood Team: సీఎం రేవంత్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు ఏమన్నారంటే..
తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించామన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చన్నారు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలన్నారు.
Bhadrachalam: రామయ్య సన్నిధిలో కొత్త విధానం.. అన్నదాన సత్రంలో డిజిటల్ టోకెన్లు..