Dil Raju: తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో స్పందన వస్తోందని FDC చైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. సినీ పరిశ్రమను ప్రపంచ వ్యాప్తం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందన్నారు. టిక్కెట్ రేటు పై, బెనిఫిట్ షోలు పై ఇప్పుడు చర్చ జరగలేదని తెలిపారు. ఇంకా మా చర్చలు అంతవరకు రాలేదన్నారు. కేవలం ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరిగిందని దిల్ రాజు అన్నారు.
Read also: Telangana DGP: పోలీసులు వద్దంటే వినాలి.. సినీ ప్రముఖులతో డీజీపీ..
కమాండ్ కంట్రోల్ రూమ్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. FDC చైర్మన్ గా ఎన్నుకున్నకా.. సీఎం నీ కలవడానికి ఈ రోజు అవకాశం ఇచ్చారు. వన్ ఆఫ్ థి బెస్ట్ మీటింగ్ ఈ రోజు జరిగింది. FDC ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం పూర్తి చేశాము. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీ , గవర్నమెంట్ కి వారధిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇండియా లెవెల్ లో తెలుగు సినిమా కి రెస్పెక్ట్ అందుతుందని, ప్రపంచ స్థాయిలో పని చేయాలని సీఎం విజన్ ఉందని దిల్ రాజు తెలిపారు.
Read also: Tollywood Team: సీఎం రేవంత్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు ఏమన్నారంటే..
ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయన్నారు. కేవలం హైదరాబాద్ లో తెలుగు సినిమాలతో పాటు, ఇతర భాషల సినిమాలు చేస్తున్నారన్నారు. ప్రపంచ స్థాయిలో ఫిల్మ్ షూటింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం తరుపున చేస్తామని సీఎం చెప్పారన్నారు. డ్రగ్స్, సమాజానికి అవసరమైన ప్రమోషన్లు చేయాలని సీఎం కోరారని దిల్ రాజు అన్నారు. అందుకు ఇండస్ట్రీ మొత్తం ఆమోదం తెలిపామన్నారు. సినీ పెద్దలందరూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని తెలిపారు దిల్ రాజు.
Chikkadpally Police: సినీ ప్రముఖుల ముందుకు సంధ్య థియేటర్ ఘటన వీడియోలు..