ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 3 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు.
Kite Festival: సంక్రాంతి పండగా సందర్భంగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న.. రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు.. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తోంది అని ఆయన తెలిపారు. ఇక, ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్ల కొట్టింది అని ఆరోపించారు. పేదవాడు ఇబ్బందులు పడవద్దని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచన.. అందుకే ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఒకే వేదికపై ప్రధాన పార్టీల నాయకులు.. మీ ఐఖ్యతకు సలాం! తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఘటన అందరినీ ఆకట్టుకుంది. భాగ్యనగరంలో బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన “ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండిసంజయ్‌కుమార్,…
నా 35 సంవత్సరాల విద్యార్థి, రాజకీయ జీవితంలో వివిధ దశల్లో కలిసి పనిచేసిన వారు ఈ వేదిక మీద ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ నేత, మహారాష్ట్ర విద్యాసాగర్‌రావు రచించిన "ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర" అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "విద్యాసాగర్ రావును అందరూ సాగర్ జీ గానే గుర్తిస్తారు. మాకు కూడా ఆయన సాగర్ జీ నే.
రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల జారీ పై సమావేశంలో చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేడు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడా ఆందోళన చేయాల్సిన అవసర లేదని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు.
కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది.