దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
Harish Rao: సిద్దిపేటలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల కోసం ప్రజలు ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు. దరఖాస్తు పెట్టినప్పుడల్లా 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో ఇచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయకుండా మూలకు పడేశారని, దరఖాస్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాల…
కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారని హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం…
నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక. లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు. దావోస్‌లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన. సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొననున్న…
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది. 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు…
నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. అయితే, గత నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ హౌస్ ను ట్రంప్ వీడాడు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు…