నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. పరీక్షలను నిర్వహిస్తూ.. వేగంగా ఫలితాలను ప్రకటిస్తూ నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో…
డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.…
దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు
CM Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనతో నష్ట పోనున్న రాష్ట్రాల గళాన్ని వినిపించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో రేపు (మార్చ్ 22) నిర్వహించనున్న సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చెన్నైలోని గిండీలో గల ఐటీసీ చోళ హోటల్లో ఉదయం 10. 30 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
NABARD: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు.
పాక్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్…
సోషల్ మీడియాలో సంచలనంగా మారిన పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తనపై, తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ.. "నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది. ఇది వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. నా అన్వేష్…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎస్సీ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపాయి. వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా 2 నిముషాలు మౌనం పాటించారు సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మాదిగ సంఘాల నేతలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేసినందుకు అసెంబ్లీ కమిటీ…