హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా…
ఆసుపత్రి నుంచి తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…
CM Revanth Reddy : తన పరిపాలనా నైపుణ్యం.. ప్రభావంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11…
భారత్‌లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద…
Telangana Govt: రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్ తో దాదాపు 6,729 మంది పైన వేటు పడింది. ప్రభుత్వంలోని పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Telangana Assembly : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పారదర్శక సంప్రదింపులు లేకుండానే కేంద్రం ఈ కసరత్తును కొనసాగిస్తోందని సభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, పునర్విభజన విషయంలో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్రస్తుత సరిహద్దుల్లో మార్పులు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో…
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. "జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర…
భారత్‌లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి.. భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది. భారత్‌లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని USCIRF నివేదించింది. ముస్లింలు, ఇతర మతపరమైన…
గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు. బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి రూ.6 వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని.. ఇవి రెండు విడతలుగా చెల్లిస్తారన్నారు. రెండోసారి ఆడబిడ్డ అయితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కానీ…
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా ప్రకటించిన సీఎం, అసెంబ్లీ సభ్యులు ఎవరూ ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ, ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై…