తెలంగాణ ఈఏపీసెట్ పలితాలు ఆదివారం (మే 11) విడుదల కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు. జేఎన్టీయూ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల అధికారులు వెల్లడిస్తారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
Also Read: KTR: స్థానిక ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తాం.. మళ్లీ మోసపోవద్దు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా.. మే 2, 3, 4 తేదీలో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా.. 81,198 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల అయింది. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి.