తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈఏపీసెట్ పలితాలు విడుదలయ్యాయి. నేడు(ఆదివారం) ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈఏపీసెట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తాచాటారు. ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొదటి ర్యాక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామ చరణ్ రెడ్డి రెండో ర్యాంక్ తో మెరిశాడు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో తెలంగాణకు చెందిన సాకేత్ రెడ్డి పెద్దకగరి ఫస్ట్ ర్యాంక్ తో సత్తాచాటాడు. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://eapcet.tgche.ac.in/
Also Read:Tata Curvv: రూ. 2 లక్షలు చెల్లించి.. టాటా కర్వ్ డీజిల్ బేస్ వేరియంట్‌ను ఇంటికి తెచ్చుకోండి!
విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్‌కే నేరుగా ఫలితాలు అందించారు. ఇంజినీరింగ్‌లో 2 లక్షల 20 వేల 326 మంది దరఖాస్తు కోగా 2 లక్షల 7 వేల 190 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్వాలిఫై అయిన వారు లక్షా 51 వేల 779 మంది. అర్హత సాధించినవారు 73.26 శాతం. బైపీసీలో 86 వేల 762 మంది దరఖాస్తు కోగా 81 వేల 198 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71 వేల 309 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులు 87.82 శాతం. గతం కంటే ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1.72 శాతం తగ్గిన అర్హత శాతం. అగ్రికల్చర్, ఫార్మ స్ట్రీమ్‌లో సుమారు 2 శాతం అర్హత శాతం తగ్గింది.
Also Read:MLC Kavitha : భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా.. మే 2, 3, 4 తేదీలో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా.. 81,198 మంది హాజరయ్యారు. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈఏపీసెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.