మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రెండు చారిత్రాత్మక బిల్లులను నేడు శాసన సభలో ప్రవేశపెట్టనున్నది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులతో పాటు మొత్తం ఐదు బిల్లులను సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. Also Read:AP 10th Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..…
ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్.. అమెరికన్ పాడ్కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్తో కలిసి స్టేడియంలో తిరగడం…
తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ ఆగ్ని ప్రమాదం.. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి ఒకటి, రెండు యూనిట్ల కూలింగ్ రూమ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో గదిలోని విద్యుత్ తీగలు కాలిపోయి ధ్వంసమయ్యాయి. అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు18 కు పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఫైర్ సిబ్బంది…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బయట బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నాం.. కానీ బూతులతో పాటు, అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు.. ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు.
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండోసారి సీఎంగా ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో మాకు ఓటు వేసారు. కానీ రెండోసారి మాత్రం మాపై నమ్మకంతోనే ఓటు వేస్తారు” అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజల గురించి మాట్లాడుతూ, “సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. మేము ఇచ్చిన ప్రతి…
పాక్లో వరస దాడులు.. బలూచిస్తాన్లో ఆర్మీ కన్వాయ్పై ఎటాక్.. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి దాడి జరిగింది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో పాకిస్తాన్ తన పరువును కోల్పోయింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోంది. ఇదిలా ఉంటే, తాజాగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) మార్గంలో పాకిస్తాన్ బలగాలకు చెందిన కాన్వాయ్ లక్ష్యంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, బహుళ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.…
ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదు.. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు…