Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత సినీ సంబురాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1, 2023 నాటి డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. జూలై 1, 2023 డీఏ మరో ఆరు నెలల్లో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడంతో ప్రభుత్వం పై నెలకు సుమారు 2400 కోట్ల భారం పడనుంది. Also Read:Jeep…
CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని… ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు.…
భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్.. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు ఇన్‌ఛార్జి జిల్లాలు మార్చారు. నల్గొండ ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ బాధ్యతలు.. కరీంనగర్ ఇన్‌ఛార్జి ఉన్న ఉత్తమ్‌కి జిల్లా కేటాయింపు లేదు.. మెదక్ ఇన్‌ఛార్జి కొండా సురేఖ ప్లేస్‌లో వివేక్‌కు చోటు.. ఖమ్మం ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి ప్లేస్‌లో వాకిటి శ్రీహరికి బాధ్యతలు.. ఆదిలాబాద్ నుండి సీతక్కను నిజామాబాద్‌కి మార్పు.. నిజామాబాద్ నుండి జూపల్లికి ఆదిలాబాద్ బాధ్యతలు.. నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్.. మెదక్…
తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్ శాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు.. అడ్లూరు లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయ్యారు. Also Read: Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు…
తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ... ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా... తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు వెళ్లగానే అందరితో సంప్రదించి కొత్త మంత్రుల శాఖలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిభారం ఎక్కువైందని ఏ మంత్రి అయునా చెప్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై తాను ఒక్కడినే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోలేనన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం తెలిపారు. మూడు రోజులుగా…
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అనే రీతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందని బీజేపీ ఎంపీ డా.కే. లక్ష్మణ్ విమర్శించారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46వ సారి ఢిల్లీ పర్యటన వెళ్లారు అనుకుంటా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 18 మాసాల పాలన విశ్లేషిస్తే.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు. పేద, వెనుకబడిన వర్గానికి చెందిన నరేంద్ర మోడీ…