CM Revanth Reddy : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (SLIP) సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అంచనాలు రూ. 13,058 కోట్ల నుండి రూ. 19,325 కోట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రివర్గ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Leopard : గోల్కొండ మిలిటరీ ప్రాంతంలో చిరుత సంచారం..
మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “సీఎం రేవంత్ ఆమోదంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది. గోదావరి జలాలను వినియోగిస్తూ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా పూర్తి చేసి, మూడు జిల్లాలు, 11 నియోజకవర్గాలకు నీటి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో మొత్తం 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. అదనంగా 3,45,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు లభించనుంది. బీడు భూములను సస్యశ్యామలం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. “ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పం” అని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ప్రాంతీయ రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, పంట ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP Elections 2025: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్!