నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్ర పోషించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ…
మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించకపోగా... సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్‌లో ఉన్నాయి.
కట్టండ్రా బ్యానర్లు.... కొట్టండ్రా డీజేలు.... చల్లండ్రా గులాల్ అన్న రేంజ్‌తో అంతా సెట్ చేసి పెట్టుకున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాణ. ఇంకేముంది... అయిపోయింది. మనకు మంత్రి పదవి వచ్చేస్తుంది. కాల్ రావడమే ఆలస్యం కారెక్కి హైదరాబాద్ వైపు దూసుకుపోవడమేనని కేడర్‌కు కూడా చెప్పేశారట. సరిగ్గా అక్కడ రాజ్‌భవన్‌లో... కవ్వంపల్లి సత్యనారాయణ అనే నేను అన్న మాట వినపడగానే... నియోజకవర్గంలో దుమ్మురేగిపోవాలంటూ.... అనుచరులకు ఆదేశాలిచ్చేశారట.
జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..! పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే…
నేడు సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న భట్టి, పొన్నం. నేడు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం. నేడు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న తుమ్మల,…
పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. వారి మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు. Also Read:Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే జూబ్లీహిల్స్…
కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను మాజీ మంత్రి హరీష్ ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదన్నారు. ఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటిలో నేను, ఈటల, తుమ్మల ఉన్నామని తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ పై నాతో పాటు…
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…
పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..! జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం,…
CM Revanth Reddy : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్…