మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “బనకచర్ల కట్టి తీరుతాం అని లోకేష్ మాట్లాడుతున్నారు.. కేంద్రం బలం, రేవంత్ రెడ్డి బలం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నారు.. లోకేష్ అలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు.. సీఎం, మంత్రులు ఎవరూ కూడా ఖండించలేదు..ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకొని ఉంది.. మేము కడితే ఎవరు ఆపుతారో చూస్తాం అని లోకేష్ అంటుంటే ..బనకచర్ల కట్టట్లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. బనకచర్ల పై లోకేష్ బరి తెగింపు మాటలు మాట్లాడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పై లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడు తున్నారు.
Also Read:Harsh Goenka: T20లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడా?.. పాక్ చమురుపై ట్రంప్పై గొయెంకా సెటైర్లు
అధికారం, కేంద్రం, రేవంత్ రెడ్డి మా చేతుల్లో ఉన్నారు కదా అని లోకేష్ ఏది పడితే అది మాట్లాడు తున్నారు.. మీరు చెప్పేది నిజం అయితే.. కేంద్రం ఎందుకు మీ డిపిఆర్ ను తిరస్కరించారు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవు అని లోకేష్ అంటున్నారు.. అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టు కు ఉన్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టు ను టీడీపీ అడ్డుకోలేదు అని లోకేశ్ అంటున్నాడు.. లోకేష్ మీకు తెలియకుంటే మీ నాన్న ను అడగండి.. కాళేశ్వరం ను అడ్డుకున్నరా లేదా తెలుసుకోండి.. కాళేశ్వరం అడ్డుకోవడానికి మీ నాన్న కేంద్రానికి ఏడు ఉత్తరాలు రాశారు.
Also Read:Home Minister Vangalapudi Anitha: వైఎస్ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
కృష్ణా నీళ్లను తరలించి నట్టుగా గోదావరి నీళ్లను తరలించుకు పోవాలని చూస్తున్నారు.. బనకచర్ల ప్రాజెక్టు ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు.. మా హక్కులకోసం మేము మాట్లాడుతున్నాం.. మాకు హక్కులకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటే మేము మాట్లాడము.. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్నాం అని మాట్లాడుతున్నారు.. తెలంగాణ ప్రజలకు కడుపు లేదా.. మా నీళ్లు మాకు రావొద్దా.. బతుకు దెరువు కోసం అడిగితే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమా.. బాబ్లీ గురించి కొట్లాడిన మీ నాన్న కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి నట్టేనా.. అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టు కు వెళుతుంది.. బనకచర్ల ప్రాజెక్టు ఆపే వరకు పోరాడతాము.. మీరు కట్టి తీరుతాం అంటే మేము అడ్డుకొని తీరుతాం.. తెలంగాణ ను అడ్డుకుంటే ఎలా తెచ్చుకున్నామో తెలుసు కదా.. కేంద్రం నీ చేతిలో ఉంది కాబట్టి సీడబ్ల్యూసీ ని ఒప్పిస్తాం అంటున్నావు.. లీగల్ గా కోట్లాడి బనకచర్ల ఆపుతామని” హరీష్ రావు స్పష్టం చేశారు.