ఆర్టీసీ బలోపేతంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది… ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఆర్టీసీ ముందుకు వెళ్తుంది.. ఈ సంవత్సరం జులై నెలలోపు మరో 1000 బస్సులు రోడ్డెక్కనున్నాయని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకం అమలు చేశామని ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తు విజయవంతంగా కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు.. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు.
మహాలక్ష్మి పథకం కింద రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో బస్సులు పై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు జులై నేలలోపు వచ్చే 1000 బస్సులకు అదనంగా మరో 275 కొత్త బస్సుల కొనుగోలుకు ఆదేశాలు జారి చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు… బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ జంట నగరాలకు ఇతర ప్రాంతాలకు బస్సు నడిపించడానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ,సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, డి ఎం వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.