మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ…
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ పాస్ పోర్ట్ మీద ప్రయాణం చేసారని సీనియర్ కౌన్సిల్ న్యాయవాది రవి కిరణ్ రావు కోర్టుకు తెలిపారు. 2019 లో OCI కార్డు కు అప్లై చేశారని సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టు కు తెలిపారు. 2019 సెప్టెంబర్ లో OCI కార్డు తీసుకునేటప్పుడు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడన్న సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టుకు తెలిపారు. గత సంవత్సర కాలం లో చెన్నమనేని ప్రయాణాలు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంకు, చెన్నమనేని కు హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారం కు వాయిదా వేసింది హైకోర్టు.
కారుణ్య నియామకాలపై ప్రభుత్వం శుభవార్త..
10 సంవత్సరాలుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల కింద 813 మందికి కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. బ్రెడ్ విన్నర్ (కారణ్య నియామకాలు), మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి/పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తుంది. సర్వీసులో ఉండగా మరణించిన సంస్థ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట అని చెప్పుకోవచ్చు.
ఏపీలో దారుణం.. రెండు నెలలుగా బాలికపై వృద్ధుడు అత్యాచారం..
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లి గ్రామంలో మైనర్ బాలిక పై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 2 నెలలుగా ఆ బాలిక పై వృద్ధుడు సంపగి రెడ్డి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా కుటుంబసభ్యులకు తెలియడంతో బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడు సంపంగి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాళ్లబుదుగూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో పెట్రేగిపోతున్న కత్తిపోట్ల ఘటనలు.. ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో దాడి
దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో ముగ్గురు నిందితులు మైనర్లు ఉన్నారన్నారు.
కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు. కేశినేని నానిని తిట్టమని చంద్రబాబు ఆదేశించ లేదని.. వాస్తవానికి నానిపై విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారన్నారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే ఇన్నాళ్లూ ఆగానన్నారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. కేశినేని నాని వైసీపీ కోవర్టు అంటూ ఆరోపించారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని కేశినేని నాని అంటున్నారని.. ఇవాళ కేశినేని నాని జగన్ కాళ్లు మొక్కాడంటూ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నాని సినిమా ఇకపై ఉందన్నారు. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకీ మీద కేసు పెట్టిన శాడిస్టు కేశినేని నాని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
నగరవ్యాప్తంగా ఎక్కడి దరఖాస్తులను అక్కడే ఆన్‌లైన్ ఎంట్రీ చేస్తున్నాం
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా ఎక్కడి దరఖాస్తులను అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. అందుకోసం 5000 మంది డేటా ఎంట్రీ సిబ్బందిని ఎంగేజ్ చేసామని ఆయన వెల్లడించారు. ప్రతి దరఖాస్తులోని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రతి వార్డులో నాలుగు కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించాము వాటిని అదేవిధంగా ఆన్లైన్ చేస్తున్నామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నామన్నారు. నగరంలో 635 డేటా ఎంట్రీ సెంటర్లను ఏర్పాటు చేశామని, నిన్న ఫ్లై ఓవర్ మీద దొరికిన ఫామ్ ల దరఖాస్తు దారులు ఆందోళన చెందవద్దన్నారు.
నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ.. మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. కాగా.. అమర్నాథ్ నియోజకవర్గ మార్పుకు సంబంధించి చర్చలు జరిగాయని అందరూ అనుకున్నారు.
సీఎంతో అమర్నాథ్ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసని చెప్పారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు. మరోవైపు.. ఈ నెలలో కర్నూల్ లో రూ. 2,500 కోట్లతో అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన పై చర్చించినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు.
లోక్‌సభ సభ్యత్వానికి కేశినేని నాని రాజీనామా
విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించిన తర్వాత వైసీపీలో చేరనున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు.
‘గుంటూరు కారం’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ కి అంతా సిద్ధం అయిపోయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. అంతేకాదు ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ఆరు షోలు వేసుకునే అవకాసహం కల్పించారు. ఇక దానితో పాటు సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ మీద 65 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 చొప్పున పెంచుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. అంతేకాక గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజున ఒంటిగంటకు షోలు వేసుకోవచ్చని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ తో పాటు హైదరాబాద్ చుట్టూ ఓ ఎమ్మెల్సీ వందల ఎకరాలు కబ్జా చేశారని కథనాలు వచ్చాయన్నారు. దీనిపై కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదని ఆయన అన్నారు. ఇలాంటి వారిని పెద్దల సభకు పంపి ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసిందని విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని ఆయన మండిపడ్డారు. భూకబ్జా గురించి కేటీఆర్ సమాధానం చెప్పాలని, శంబిపూర్ రాజు కేటీఆర్ బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు. కుత్బుల్లాపూర్ లో ఉండేది శంబిపూర్ రాజు అని, గతంలో ఎమ్మెల్సీ కబ్జాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారు. భూకబ్జాలు చేసిన దొంగల భరతం పడతారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవర్ని వదిలిపెట్టరన్నారు. ధరణిలో పేరు మార్చి వందల ఎకరాల భూములు దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మున్సిపల్ కార్మికులతో చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాగానే కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు విధుల్లోకి రానున్నారు. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని, కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి వెయ్యి రూపాయలు కొత్త బట్టల కొనుగోలుకి ఇస్తామన్నారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఐదు నుంచి ఏడు లక్షలకు సాయం పెంచామని మంత్రి చెప్పారు
అమరావతి రాజధానిగా ఉంటుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవి కోసం, పవన్‌కు అధికారము కోసం ఈ పోరాటం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తునిలో ‘రా కదలిరా’ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని ఆయన అన్నారు. జగన్ పని అయిపోయిందని.. జీవితంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. దేశం మొత్తం మీద పెట్రోల్ ధర రాష్ట్రంలోనే ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. యువత తొంభై రోజులు సైకిల్ ఎక్కి గ్లాస్‌లో నీళ్లు తాగి ప్రజలను చైతన్యం చేయాలని ఆయన సూచించారు. టీటీడీలో నాసి రకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దని.. మీకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కప్పం కట్టలేక పరిశ్రమలు పారిపోతున్నాయని ఆయన మండిపడ్డారు.
త్వరలో కొత్తగా విద్యుత్తు పాలసీ
విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కమ్ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపైనా వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అందుకే వైసీపీని వీడుతున్నా.. అంబటి రాయుడు ట్వీట్
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో తెలిపారు. పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలిశాననే విషయంపై స్పష్టత ఇచ్చారు. వైసీపీని వీడుతున్నానని, రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ నిర్ణయం తీసుకునే ముందే పవన్ కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పాలని అంబటి రాయుడు చెప్పారు. అందుకే తానే పవన్‌కళ్యాణ్‌ను కలిశానని చెప్పారు.