హైదరాబాద్ నగరంలోని 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2, 400 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.
తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు.
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Nampally Exhibition:నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 1న సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నారు.
Uttam Kumar Reddy: నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశమిచ్చారు. ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలి అన్నది మన ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత…
రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల…
తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా…
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.