బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు.
చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53…
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జితేందర్ రెడ్డి. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని,…
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండగా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన…
వేణు స్వామి క్రేజ్ మాములుగాలేదు.. కన్నడ హీరోయిన్ తో పూజలు.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు వైరి పక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు.