నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల…
రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన న్యూఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. తన పర్యటనలో ఆయన ఏఐసీసీ నేతలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కోరగా, వారి ఆమోదం మేరకు…
Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని సంచలన ఆరోపణ చేశారు.
నీట్ వివాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంకోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం…
నిరుద్యోగ యువత ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి టి హరీష్‌రావు శనివారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు , రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు , నిరుద్యోగ యువత సమస్యలపై చర్చిస్తుందని అంచనాలు ఉన్నాయి, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని మాజీ మంత్రి అన్నారు. నిరుద్యోగ…
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది.…
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ 500 నుంచి 1000 ఎకరాల్లో విస్తరించి దానికి అనుగుణంగా భూమిని సేకరించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడి ఈ హబ్‌లో అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందించాలనే ఆలోచన ఉంది. హబ్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి శనివారం ఇక్కడ తెలిపారు.…
Mahesh Kumar Goud: 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చారిత్రక నిర్ణయమని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరిగింది.
నో ఫ్లై జాబితాలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కెనడా కోర్టు కీలక తీర్పు కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్ తిరస్కరించింది. ఇద్దరు కెనడియన్ సిక్కులు విమానాలు ఎక్కేందుకు 2018లో నిషేధం విధించింది. అయితే ఇద్దరూ రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తారని.. ఉగ్ర చర్యకు పాల్పడతారన్న సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి.. వారి…
రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 2023లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ…