టీ20 ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఇంటర్నేషనల్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఒక్కరోజు తర్వాత జడేజా ఈ ఫార్మాట్‌కు బై బై చెప్పాడు. రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో 4 లైన్ల సందేశాన్ని రాసి తన భావాలను వ్యక్తం చేశాడు. జడేజా ఇలా రాశాడు.. “నేను కృతజ్ఞతతో…
పోలవరంపై చంద్రబాబుకు మాత్రమే అవగాహన ఉంది.. చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు…
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయ ప్రోత్సాహకంగా వరంగల్‌లో 300 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్. ఫార్మారంగం…
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు సీఎం రేవంత్. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా…
Congress: తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట…
రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు.
రైతుల రుణమాఫీ కోసం నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన స్పష్టం చేశారు. రూ.2 లక్షలు వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని.. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు.