బాలిక గ్యాంగ్ రేప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరేడ్ మెట్ కి చెందిన యువకుడు విజయ్ కుమార్ కాచిగూడకి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ కుమార్ కి కాచిగూడ కి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎన్ కౌంటర్ లు ఎన్ని జరుగుతున్నా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు క్రమంగా పెరుగుతున్నాయి.
నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగియడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఐఏఎస్ ఆఫీసర్ కాట ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారుల కన్నా పవర్‌ఫుల్‌గా మారారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు.
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని.. ఇది చారిత్రక నిర్ణయమని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం కేసీఆర్, కేటీఆర్‌లకు ఇష్టం లేనట్లుందని ఆయన విమర్శించారు.
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్.. పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు…
నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్‌సభ ప్రొటెం…