హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు ఆయా జిల్లాల…
ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి…
K. Keshava Rao: ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
MLA KrishnaMohan Reddy: గద్వాల బీఆర్ఎస్ మ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు…
BRS MLCs In Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.