CM Revanth Reddy: ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే..!
- ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే..
- చెరువులు.. నాలాలు.. కుంటల కబ్జాదారులకు సీఎం సీరియస్ వార్నింగ్..
- మా హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టం అయిపోతాయి: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ పోలీస్ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా 547 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పరేడ్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు వ్యసాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. గంజాయి, డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం.. ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అన్నారు. మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మనదే అని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, వరంగల్ లో పోలీసుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.. ఒక్కో స్కూల్ 50 ఎకరాల్లో నిర్మిస్తాం.. పోలీసుల పిల్లలకు 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Read Also: Suicide Attempt: సూసైడ్ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)
Also Read
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
- CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
కబ్జాదారులకు సీఎం రేవంత్ వార్నింగ్..
ఇక, చెరువులు, నాలాలు, కుంటలు కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టం.. కబ్జా చేసిన వాళ్లు మీకు మీరుగా ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేదంటే మా హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టం అయిపోతాయని హెచ్చరించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు.. ఫామ్ హౌస్ లలోని డ్రైనేజీ నీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో కలుపుతున్నారు.. చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి.. దుర్మార్గులు చెరువుల్ని ఆక్రమించడం వల్లనే వరదలు వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసే బాధ్యత మాదే.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Read Also: Deputy CM Pawan Kalyan: ఏలేరు వరద ఉధృతి.. కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్..
అయితే, ప్రభుత్వ భూములు, చెరువులలో కబ్జాలు చేసిన వారిని సహించేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన వారికి రెగ్యులరైజ్ కాదు.. ఎప్పటికైనా ఆ నిర్మాణాలను కూల్చివేయాల్సిందే.. భావితరాలకు అందజేయాల్సిన చెరువులను, కుంటలను కబ్జాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ పరిసరా ప్రాంతాల్లో నిర్మించిన ఫాంహౌస్ లు, గెస్ట్ హౌస్ డ్రైనేజీ వీటిల్లో కలిపి వేస్తున్నారు.. ఆ వాటర్ ను నగరవాసులకు మంచినీరుగా అందిస్తున్నాము.. ఇలాంటి ఫామ్ హౌస్ లను ఉంచాల్నా, కూల్చాల్నా మీరే చెప్పండి అని అడిగారు. కాస్మోటిక్ కి పోలీస్ కాదు కాంక్రీటు పోలీస్ గా ప్రతి ఒక్కరి విధి నిర్వహణ ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!