Rachakonda: పిల్లలు ప్రయోజకులుగా మారినప్పుడు తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన కూతురు తనకంటే పెద్ద హోదా అందుకోవడంతో ఓ తండ్రి ఉద్వేగానికి లోనైన అరుదైన ఘటనకు SSI ట్రైనీ క్యాడెట్ల మూడో దీక్షాత్ పరేడ్ వేదికైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జి రాంచందర్ రావు అనే వ్యక్తి ఏఆర్ఎస్ గా పనిచేస్తున్నాడు. అతనికి సౌమ్య అనే కూతురు ఉంది. కానీ రాంచందర్ రావు మాత్రం తన కూతురిని భవిష్యత్తులో తనకంటే పెద్ద స్థానంలో చూడాలని కలలు కన్నాడు. అనుకున్నట్టుగానే కూతురు సౌమ్యను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించాడు. అలా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం తన కళ్లముందు కనిపించింది.
Read also: Kaushik Reddy: నాకు 39, నీకు 7ం ఏండ్లు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో..
తన కూతురు సౌమ్య ఎస్సైగా శిక్షణ పూర్తి చేసుకోవడంతో తండ్రి ఆనందానికి అవధులు లేవు. బుధవారం పరేడ్‌ను ముగించిన అనంతరం రాంచందర్‌రావు తన కుమార్తె సౌమ్యకు సెల్యూట్ చేశాడు. సౌమ్య బ్యాచ్‌లో టాప్-10లో స్థానం సంపాదించడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘ముఖ్యమంత్రి రివాల్వర్ బెస్ట్ అండ్ బెస్ట్ ఆల్ రౌండర్’, ‘హోమ్ మినిస్టర్స్ బ్యాటన్ విత్ సిల్వర్ ఎండ్ ఫర్ బెస్ట్ ఇండోర్’ అవార్డులు అందుకోవడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఏఆర్ఎస్ సౌమ్య తన తండ్రి నుంచి మొదటి సెల్యూట్ దక్కడంతో భావోద్వేగానికి లోనైంది. తండ్రి కూతురిని చూసిన వారందరూ ఆనందంతో ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.
Edupayala Temple: మరోసారి మూతపడ్డ ఏడు పాయల ఆలయం