ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7వేల పై చిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించారు
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు.. ఈ భూముల్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.. ఏమనుకుంటున్నారు?.. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయింది.. అసైన్డ్ భూములను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదు.. రింగ్ రోడ్డు అప్పుడు కూడా ఇలానే అసైన్మెంట్ భూములకు రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్ రెడ్డితో కొట్లాడాం.
బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
తెలంగాణలోని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. రేపు సాయంత్రంలోపు డీఏ (DA)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటి వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy: సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ..కానిస్టేబుల్స్ ను కేసీఆర్ మనుషులుగా చూస్తే.. రేవంత్ రెడ్డి మర మనుషులుగా భావిస్తున్నారన్నారు. నల్లగొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయటం దారుణమన్నారు. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KTR Tweet Viral: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. రేపు (బుధవారం) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఫార్మా కంపెనీ కడితే కట్టు… లేకపోతే కాంగ్రెస్ పార్టీ రైతులకు తిరిగి భూములను ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ప్రమిద కన్వెన్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్, జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్యే సబితా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రవేశ పెట్టిన రిజర్వేషన్లు అమలు చేయండని అన్నారు. కార్యకర్తలను…
పంతాలు.. పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని, రేపు పరీక్షలని తెలిసి కూడా ఈరోజు కూడా ఆందోళనను కొనసాగిస్తున్నారంటే అర్ధం చేసుకోండి, నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్ధం చేసుకోండి, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయండని కేంద్రం మంత్రి బండి సంజయ్ అన్నారు. 29జీవో వల్ల గ్రూప్ 1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారని, 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం…