CM Revanth Reddy : ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
- డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన విజయోత్సవాలు
- విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు
- అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Shanti Kumari : డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు.
శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లో ఈనెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈనెల 30వ తేదీన మహబూబ్‌నగర్ లో ఏర్పాటు చేసే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు రోజుల ముందు నుంచే.. 28వ తేదీ నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి అవసరమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పంటల బీమా, సన్న వడ్లకు బోనస్.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.
డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
డిసెంబర్ 1వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. తమ శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు.
ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్లో సెక్రెటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాంతమంతా ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు. అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలని చెప్పారు.
రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన సెక్రెటేరియట్ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు.
నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి… లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు.
Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!