Kerala High Court: వామపక్ష సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. 2017లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌లో వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలను కేరళ హైకోర్టు రద్దు చేసింది. ఇండియన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి చర్యలు పరువు నష్టం లేదా చట్ట విరుద్ధమైనవి కాదని కాదని జస్టిస్ బెచు కురియన్ థామస్ తీర్పు ఇచ్చారు. అయితే, 2017 ఏప్రిల్ 9న సీఎం కాన్వాయ్ ఉత్తర పరవూరు మీదుగా వెళుతుండగా సిమిల్, ఫిజో, సుమేష్ దయానందన్ నల్లజెండాలు ప్రదర్శించడంతో ఈ కేసు నమోదు అయింది. ఈ ముగ్గురిపై తొలుత పరువు నష్టం, ప్రజా మార్గాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు హాని కలిగించడం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
అయితే, సాధారణంగా నిరసనతో ముడిపడి ఉన్న నల్లజెండాను ప్రదర్శించడం పరువు నష్టం కలిగించేదిగా లేదా చట్టవిరుద్ధంగా భావించలేమని జస్టిస్ థామస్ చెప్పుకొచ్చారు. ఈ కేసులో తాము ఎలాంటి జరిమానా విధించలేమని తెలిపారు. అలాగే, నిరసనకారులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు నిజంగా ఆటంకం కలిగించారని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొనింది. పోలీసులు త్వరగా జోక్యం చేసుకుని.. ఎలాంటి అంతరాయం కలగకుండా నిరోధించారని నివేదికలో తెలిపారు.