తెలంగాణలో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల స్పందన, బిజెపి కు ఆదరణ చూసిన తరువాత ఆందోళన చెందిన సీఎం కే.సి.ఆర్ “దళితబంధు”పథకాన్ని తీసుకు వచ్చారు అని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని గౌరవించని సీఎం దళితుల మీద “ఫేక్ ప్రేమ” చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫేక్.. ఆయన పథకాలు ఫేక్ అని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. “ఫేక్ ఐడి” కార్డులు, తప్పుడు ప్రచారాలు చేసే స్థాయికి దిగజారారు. కోట్ల రూపాయలు కుమ్మరించి ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కు తన పాలనపై నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎదుర్కొనాలి అన్నారు. అక్రమ పద్ధతిలో ఉపఎన్నికను గెలవాలని చూస్తున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి బంపర్ ఆఫర్లతో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ వ్యవహార శైలిని ఛీదరించుకుంటున్నారు. తెలంగాణ లో అభివృద్ధిని మతకోణంలో చూస్తున్నారు. హిందువులు నివసించే ప్రాంతాలలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చి వేతలకు పాల్పడుతున్నారు. పాతబస్తీలో పన్నులు కట్టకపోయినా, రోడ్లు ఇరుకుగా ఉన్నా అక్కడ కూల్చివేతలకు పాల్పడే ధైర్యం కేసీఆర్ కు లేదు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరో న్యాయం ఉండకూడదు. పాతబస్తీ అభివృద్ధిని టీఆర్ఎస్ , ఎంఐఎం అడ్డుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయి. కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ కి ధైర్యం ఉంటే పాతబస్తీలో రోడ్లు వెడల్పు చెయ్యాలి.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!