తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో బీసీ కమిషన్‌లో సభ్యుడిగా ఉన్న వకుళాభరణం కృష్ణమోహన్‌ను ఇప్పుడు చైర్మన్‌ను చేశారు సీఎం కేసీఆర్… ఇక, బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్రను నియమించారు.. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించనుంది సర్కార్.. ఇక్కడో కీలక విషయం ఏంటంటే… వకుళాభరణం కృష్ణమోహన్ కూడా హుజురాబాద్ నియోజకవర్గ వాసియే.. త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వకుళాభరణంను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అక్కడి నుంచి అమలు చేస్తున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.. ఇప్పుడు కృష్ణమోహన్‌కు బీసీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది.