చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడుతా : సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.
Also Read
- Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
- PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
తాజావార్తలు
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
PCB: కీలక నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్..
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
-
Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!