కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిన్న రాత్రి కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడే బస చేశారు. ఇక ఇవాళ ఉదయం.. కరీంగనర్ జిల్లాలోని ఓ టీఆర్‌ఎస్ నేత కూతురి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు. ఇక కలెక్టరేట్ లో మరికాసేపట్లో దళిత బంధు పథకం పై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా… సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగస్తులను తప్ప ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. ఉద్యోగస్తులకు గుర్తింపు కార్డు ఉంటేనే కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు.