హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…
నిరంతరం ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం… మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. హుజురాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు గ్రామస్తులు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను…
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపించే మాట… ప్రత్యర్థులు వాటిని అర్థం చేసుకునే లోపే ఆయన తన పని చక్కబెట్టుకోగల నేర్పరి. ఎంతో ముందుచూపుతో ఆయన వ్యూహాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా తనకు ఏమాత్రం ఫరక్ రాకుండా చూసుకోవడం కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. తెలంగాణ ప్రజలందరీలో ఉద్యమ…
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని…
ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ… హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని…
మూడురోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. రేపు హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేంద్రం కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేశారు. దీంతో 120 మందికి పదోన్నతులు లభించనున్నారు. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు. అలాగే… 33 మంది సెక్షన్ ఆఫీసర్లు.. అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనుండగా… 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. అంతేకాదు… 8…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఛాతీ లో ఉన్నది గుండెనా? బండ నా? అంటూ తీవ్ర స్థాయి లో వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గజ్వేల్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని… వారికి అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గజ్వేల్ కి ఏమి చేశాడని మండిపడ్డారు. తాలిబన్ల చేతి లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు…
సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా…
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటును గుంజుకుంటాం.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడమని… ఎన్నికల కోసమే దళితబంధు అని నిప్పులు చెరిగారు. నిజాంషుగర్ ను ప్రైవేటీకరణ చేసి వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక్కడి రైతులకు కావాల్సిన పసుపు బోర్డు తేవడంలో…