తెలంగాణలో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీకర్ సెక్షన్ కాలనీలలో ఆలయాల నిర్మాణానికి రూ. 7.56 కోట్లు కేటాయించామన్నారు. దీనికి సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్ లో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. సర్వశ్రేయో…
తెలంగాణలో వరి పంట కొనుగోలుపై మాటల యుద్ధం సాగుతోంది. విపక్షాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీని తూర్పారబెడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సీఎం కేసీఆర్‌పై ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పారా హుషార్…
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతూ వుంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ వుంటారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు తన దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల సంగారెడ్డి మున్సిపాలిటీకి 15 కోట్ల 30 లక్షలు మంజూరు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు ప్రతి నెల 341 కోట్ల రూపాయల…
కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులే కేసీఆర్.. ప్రభుత్వానికి పాడే కడతారంటూ నిప్పులు చెరిగారు షర్మిల. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని చురకలు అంటించారు. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదని…కేసీఆర్ రైతు హంతకులని ఫైర్ అయ్యారు. రైతును కాటికి పంపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది… మీ అధికారానికి…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీలో ప్రాంతీయ పార్టీల కూటమి గురించే చర్చించారా? ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తారా? ఫెడరల్ ఫ్రంట్‌కు రూపు తీసుకొస్తారా? ఆ మధ్య శివసేన, ఎన్సీపీలతో మమత చర్చలు..! 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ జాతీయ…
సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 19వ తేదీన వనపర్తి జిల్లా పర్యటన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మరుసటి రోజు 20వ తేదీన జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.…
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో పాటు ధాన్యం కొనుగోలు ఇతరత్ర అంశాలపై 17, 18 తేదీల్లో సమావేశం నిర్వహించారు. 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్…
బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో తన క్యాంప్ ఆఫీస్‌లో తిరు కె.చంద్రశేఖర్ రావు మంత్రి కేటీఆర్‌తో కలిసి తనను మర్యాదపూర్వకంగా కలిశారని, అద్భుత సమయాన్ని తనతో గడిపారని ట్వీట్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. కేసీఆర్ పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు.ఈ భేటీలో ఇద్దరు సీఎంలు కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. READ ALSO తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…