తెలంగాణలో వరి పంట కొనుగోలుపై మాటల యుద్ధం సాగుతోంది. విపక్షాలు అధికార టీఆర్‌ఎస్ పార్టీని తూర్పారబెడుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సీఎం కేసీఆర్‌పై ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు. రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పారా హుషార్ రైతన్నా! అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాదు #KCRFailedTelangana #ByeByeKCR హ్యాష్ ట్యాగ్ హైలైట్ చేశారు రేవంత్.
తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడు.
— Revanth Reddy (@revanth_anumula) December 16, 2021
రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు.
పరాహుషార్ రైతన్నా!#KCRFailedTelangana#ByeByeKCR pic.twitter.com/WNvtgxtI8N