మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి…
సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న బీజేపీ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి. అక్కడ ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది,దుబ్బాక, హుజురాబాద్ లో గెలిచినట్టు సిద్దిపేట లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నాం అన్నారు. ఇక రాష్ట్రంలో అవినీతి చెత్త కుప్పలా తయారైంది,రాష్ట్రం ఓకె కుటుంబం గుప్పిట్లో బంది అయ్యింది. బీజేపీ వైపు చాలా మంది ఎదురు చూస్తున్నారు,వేములవాడలో ఎన్నికలు వస్తే…
మెదక్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు.. రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్నారు కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతేకాకుండా వడ్లు వేయాల్సిన…
తెలంగాణ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు శుభవార్త చెప్పింది… వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను 30 శాతం పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకోవడం ఉత్తర్వులుజారీ చేయడం జరిగిపోయాయి.. అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను 6,000 రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది.. అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.10,500 నుంచి 13,650 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, జులై నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానుండగా.. ఈ…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘బడుల బాగు’ పథకం త్వరలోనే పట్టాలెక్కనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ.2000 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4000 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు…
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు…
నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం…
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని…