తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ. ఈ నెల 20 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వడం పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. వడ్లు కొంటామని ఒక్కసారి, కొనమని చెప్తూ తెలంగాణ…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందని వెల్లడించారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్.. కార్మికులను బెదిరించారని ఆగ్రహించారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి అని నిలదీశారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని పేర్కొన్నారు. జలహక్కులకు…
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హింస, ఘర్షణలు ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాలని కోరారు. విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ ఎస్ నేతలను ఉరికించాలని… కేసీఆర్ కు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఓవైసీ పెట్టుకుని మత పర హింస గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. ఇంటర్ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సారి జరిగిన ఇంటర్ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేనని గుర్తు…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు టి.పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి… ఈసారి లేఖలో పోస్టింగుల కోసం వెయిటింగ్‌లో ఉన్న అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టిన అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని విన్నవించారు.. ఆంధ్ర నుండి తెలంగాణకు కేటాయించిన తెలంగాణ బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా…
దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. మొదటగా తాను దత్తతతీసుకున్న వాసాలమర్రిలో పూర్తిస్థాయిలో అమలు చేసిన కేసీఆర్.. ఆ తర్వాత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతటా అమలు చేయాలన్న ఉద్దేశంతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిధులు కూడా విడుదల చేశారు.. అంతే కాకుండా.. మరికొన్ని మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే, దళితబంధు పథకం కింద…
తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు చేయూతనందించడం కోసం వారికి ఆర్థిక సాయం అందించాలని గతంలోనే ప్రతిపాదించింది. కాగా ఇప్పటికే మొదటి విడతలో చాలా మంది రూ.10వేలకు పైగా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో రూ.10వేల రుణం చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20వేల వరకు పంపిణీ చేయాలని ఇప్పించాలని నిర్ణయించింది. Read Also:కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం…
తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు సీఎం కేసిఆర్. ప్రారంభించిన వారం నుండి పది రోజుల్లో గతంలో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు అమలు పై రైతులు ఆందోళన చెందనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే.. దళిత బంధు…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దళిత బంధుపై కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ త్వరలోనే దళిత బంధు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు. దళిత బంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని, హుజురాబాద్‌తో పాటు…
నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు. వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి…