కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ…
హైదరాబాద్ కు తలమానికమయిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభం అయింది. నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్…
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు ఉమ్మడిగా కృషి చేసిన ప్రజా ప్రతినిధులందరినీ కేసీఆర్ అభినందించారు. ఈ…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్‌లో విసృతస్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మొండి వైఖరిని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియోను కింద ఉన్న లింక్‌లో వీక్షించండి..
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షత విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండని వివరించారు. కేంద్రం చేతులెత్తేసింది…
కేసీఆర్ అధ్యక్షతన నేడు టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం ఇందులో పాల్గొంటారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రంతో డీ అంటే ఢీ అంటున్న టిఆర్ఎస్ కార్యాచరణ… ఈ సమావేశం తర్వాత ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు…
నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు.…
యాసంగి కాలంలో.. వరి వేసిన రైతులకు రైతు బంధు కట్ చేస్తామనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. రైతు బంధు పై అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై నెపం మోపి తప్పించుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతు బంధు పేరుతో… సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు…
టీఆర్ ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర నాయకుడు బాబు మోహన్ కామెంట్స్ చేశారు. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల చేతులో ఉన్న ఓటు వజ్రాయుధం లాంటిదని దిగ్గజ నేతలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లకు సైతం ఓటమి తప్పలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల శ్రేయస్స కోసం నిలబడని ఎంత గొప్ప నాయకుడైన మట్టి కరువడం ఖాయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ది…
టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని.. బీజేపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విర్రవీగి పోతున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల్లో రుజువైందని ఆగ్రహించారు. వాళ్ళ పార్టీ ఓట్లను కూడబెట్టుకోవడంలో విజయవంతం అయినట్లు ఉంది వారి వ్యవహారం ఉందని మండిపడ్డారు. నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కేసీఆర్ జిల్లా ల పర్యటన చేస్తున్నారని.. నేనే పార్టీ అధ్యక్షుడిని అని…