ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు, అవసరమైతే శాఖాధిపతుల సలహా తీసుకోవాలని తాజా ఉత్తర్వులు…
తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనతో సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించారు.కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కుటుంబసభ్యులతో స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్ వెళ్ళారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన…
తెలంగాణ మాజీ స్పీకర్ తాజాగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. Read Also: పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది… ఇవాళ ఫలితాలు వెలువడిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు సీఎం మాకొద్దు అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ”ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతను మోసం చేసినవ్ కదా కేసీఆర్.రాష్ట్రంలో 39% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం నింపింది లేదు. నోటిఫికేషన్లు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే మీలో చలనం లేదు. మిమ్మల్ని కుర్చీ దించితే గానీ మా బిడ్డలు ఉద్యోగాలు ఎక్కరు. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు.”…
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీబిజీగా వున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు,…
రైతులు చనిపోతే రూ.3 లక్షలు ఇస్తానన్న సీఎం కేసీఆర్..సాయితేజ కి కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు వి హనుమంతరావు. దేశం కోసం చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తే యువత ఢిపెన్స్ లో చేరేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. బిపిన్ రావత్ దగ్గర పనిచేసే సాయితేజ చనిపోయాడు..తాను అయన కుటుంబాన్ని ఇవాళ పరామర్శించానన్నారు. కానీ… దేశానికి సేవ చేసిన సాయితేజ అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రి ఒక్కరూ కూడా పాల్గొనలేదనిఫైర్ అయ్యారు. సానియామీర్జా, పివి సింధులకు…
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు…
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 317పై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్న ఆయన.. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనం అని మండిపడ్డారు. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. సీఎం కేసీఆర్.. సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయలబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని విమర్శించారు..…
✍ నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన… హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా✍ కర్నూలు: నేడు డోన్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం… వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష… హాజరుకానున్న మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం✍ నేడు తమిళనాడు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్… శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్……