టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు. ఫరీదుద్దీన్ అకాల…
నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కన్నుమూవారు.. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కాసేపటి క్రితమే.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.. సంగారెడ్డి జిల్లా జాహీరాబాద్‌కు చెందిన అల్హాజ్ మహమ్మద్ ఫరీదుద్దీన్… హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికొత్స పొందుతూ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్…
నల్గొండ కలెక్టరేట్ లో సీఎం కెసీఆర్ సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో అమలవుతున్న పథకాలతో పాటు సమస్యలపై చర్చించారు. పోడు భూముల సమస్య, మెడికల్ కాలేజీ నిర్మాణం, దళిత బంధు పథకం అమలు పై కేసీఆర్ చర్చించారు. Read Also: పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు మూసివేత…
సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి…
తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్‌ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్‌లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు…
సూర్యాపేటలో తెలంగాణ ప్రాంత శిక్షణ తరగతులలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 124, 2018 లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయని, స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలని కోరారు. కానీ 3 సంవత్సరాలు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమిత అయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చలు జరపకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి కేసీఆర్ ఇప్పుడు పరుగులు పెడుతున్నారని ఆయన…
గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్‌లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్‌కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్‌ఎస్‌కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే…
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రజాసేవనే ప్రజలు గుర్తుంచుకుంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, సౌమ్యుడైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాదిరిగా కొంత కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత తాతా మధుసూదన్ అన్నారు. స్థానిక సంస్థల…
తెలంగాణ రాష్ట్ర సమితికి 2021 సంవత్సరం చేదు తీపి మిశ్రమం. అయితే తీపికన్నా చేదు పాళ్లే కాస్త ఎక్కువని చెప్పవచ్చు. దానికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని వున్న తాజా పరిస్థితులు. అంతేకాదు, కొత్తం సంవత్సరంలో అధికార పార్టీ కోసం పెద్ద సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. కాబట్టి, టీఆర్‌ఎస్ భవిష్యత్ ప్రయాణం అంత కూలాసాగా సాగకపోవచ్చు. బీజేపీ రూపంలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రతిపక్షం సిద్ధమవుతోంది. 2023 ఎన్నికల నాటికి అది మరింత శక్తివంతంగా మారవచ్చు. అలాగే, టీఆర్‌ఎస్ పాలనలో…