రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని రైతులకు అందించడానికి నిధుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన రైతు బంధు పథకం గురంచి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకాన్ని అర్హులు అయిన ప్రతి ఒక్క రైతుకు అమలు చేస్తామన్నారు. అలాగే సోమవారం ఐదో రోజు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్ లలో జమ అయ్యాయని తెలిపారు. నేడు రూ. 1047.41 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. వీటితో నేడు 4,89,189 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.ఈ సారి రూ. 5,294 కోట్లను 57,60,280 మందికి పంపిణీ చేశామని తెలిపారు.
Read Also:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అలాగే రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ. 50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు. అందుకే నేటి నుంచి జనవరి 10 వరకు రైతు బంధు దినోత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి ముందు రైతు బంధు పథకానికి సంబంధించిన ముగ్గులు వేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, పెయింటింగ్ వంటి పోటీలను నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడ రైతు బంధులాంటి పథకం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!