తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌కి సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతుబంధు ఉందా? అని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు వచ్చాయని, అదే టైంలో ఆంధ్రాలో ధరలు ఢమాల్ అన్నాయన్నారు. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి… మా దమ్ము ఏంటో చూపిస్తాం అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ బుడ్డారఖాన్……
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల…
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయములో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని, ఎప్పుడైనా కేసీఆర్ జైలుకి వెళ్ళొచ్చన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్ కు తెల్సి పోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతల తో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లి…
కరోనా కేసుల తీవ్రత రోజూ పెరుగుతోంది. వైద్యులు, వైద్య విద్యార్ధుల్ని కూడా మహమ్మారి వదలడం లేదు. కరోనా వేళ గర్భిణులకు సర్కారు భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే చూడాలని ఆదేశాలున్నా కోవిడ్ బాధిత గర్భిణుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్ చేయాలన్నారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డుల కేటాయింపు ..ఇతర పాజిటివ్ బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సల…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర సోనియాగాంధీది. వైద్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్. రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అంటే మమ్మల్ని నమ్మలేదు జనం. ఒకసారి లక్ష మాఫీ చేస్తాం అని చెప్పిన కేసీఆర్‌ని నమ్మి ఓటేశారు. రైతులు నమ్మి ఓటేస్తే రుణమాఫీ ఇప్పటికీ జరగలేదన్నారు జగ్గారెడ్డి.
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
తెలంగాణలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందన్నారు మంత్రి కేటీఆర్. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారింది. ప్రాథమిక పాఠశాలల నుండి… ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలి. కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్ ఫిట్ నేస్, ఫిజికల్ విద్య తప్పనిసరి. హైదరాబాద్‌లోని దాదాపు పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేవు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారు.…
కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌కు కొత్త నేత అవసరం వచ్చిందా? వనమా రాఘవ వ్యవహారంతో జలగం అక్కడ మళ్లీ యాక్టివ్ అవుతారా? ఆ నియోజకవర్గంపై కన్నేసిన గులాబీ నేతలు ఎవరు? మారిన పరిణామాలు ఎవరికి ఆశలు రేకెత్తిస్తున్నాయి? కొత్తగూడెం టీఆర్‌ఎస్ పరిణామాలపై ఆసక్తిఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో.. రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు జైలు పాలయ్యారు. ఈ కేసు రాజకీయంగా దుమారం రేపింది. ఒకవైపు వనమా రాఘవను టీఆర్ఎస్ సస్పెండ్…
తెలంగాణలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గులాబీ నేతలు తమ అధినేతపై అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బొమ్మను వెరైటీగా తయారుచేయించారు. 200 క్వింటాల్ నవ ధాన్యాలతో కేసీఆర్ బొమ్మతో పాటు జై తెలంగాణ, రైతు బంధు నినాదాలతో రూపొందించారు. పంట పొలాల్లో కేసీఆర్ బొమ్మని వడ్లు బియ్యం ,మొలకలతో తయారుచేసి వెరైటీగా రైతు బంధు ఉత్సవాలను నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీనిపై ఊరి పేరుతో పాటు జై…