తెలంగాణా ప్రభుత్వ నిర్లక్ష్యం, కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో బహుళ మోడల్ రవాణా వ్యవస్థ (Multi Model Transport System) రెండవ దశ పనులు నిలిచి పోయాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ పనులు త్వరిగతినా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రెండవ దశలో రైళ్లు రాయగిరి (భువనగిరి జిల్లా) వరకు పొడిగించుటకుకేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసి, రాష్ట్ర ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఎవరు అడ్డుకున్నారు.? బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిపై నిందలు ఆపండని ఆయన అన్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉందని, 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు…
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యారంగంలోనూ తెలంగాణను నంబర్ వన్ స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్కూల్స్ ఎంపిక చేస్తూ.. ప్రైవేటు స్కూల్స్ దోపిడీ ని అరికట్టేందుకు ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. పూర్వ…
కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేశానని చెప్పడం పచ్చి అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రాణహిత – చేవెళ్ల క్లోజ్ చేశారని ఆయన విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతలను ఆపేశారు. పాలమూరు రంగారెడ్డి అలైన్మెంట్ మార్చి .. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు అని ఆయన అన్నారు. వికారాబాద్ ను ఔషధ…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లు నాయకులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేడు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్ కౌంటర్ వేశారు. రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అని కేసీఆర్ కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నాడని ఆయన విమర్శించారు. అంతేకాకుండాఇప్పుడు బంగారు భారత దేశం అంటున్నాడు కేసీఆర్.. సెంటిమెంటు రగల్చేందుకు ప్రయత్నం…
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి…
ఎన్నో సంక్షేమ పథకాలతో, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్ ఎంపీ బడుగు లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీలు కేసీఆర్ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో కేసీఆర్ కు జనాదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తోందని, విభజన హామీలు నెరవేర్చమని కోరుతున్నా పట్టించు కోవటం లేదని ఆయన మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరయినవి కావని ఆయన…
తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన వారిలో అల్లం పద్మ ఒకరు. ఆమెని తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్ధులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో…
తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50…