Allam Padma Passes away: ‘అమ్మ’ అస్తమయం..విషాదంలో తెలంగాణ సమాజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించిన వారిలో అల్లం పద్మ ఒకరు. ఆమెని తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్ధులు చిరకాలం గుర్తుంచుకుంటారు. ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు. గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తూనే అప్పట్లో ఉద్యమంలో, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు. తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ.
ప్రధానంగా ఉస్మానియాలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో మెస్ లు కూడా మూసేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన సమైక్య పాలకులకు ఆ విద్యార్థుల ఆకలి తీర్చి ధీటైన సమాధానం చెప్పి ఎందరో విద్యార్థులకు ఆకలి తీర్చిన అమ్మ అల్లం పద్మ. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్థాపించి ఉద్యమాన్ని ఉరకలెత్తించి,నమస్తే తెలంగాణ సంపాదకులుగా పనిచేసి,ప్రస్తుతం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మక్క. ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీ లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉంచుతారు. అప్పటివరకు మృతదేహం నిమ్స్ ఆసుపత్రిలో ఉంటుంది. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు అల్లం పద్మ అంత్యక్రియలు జరుగుతాయి.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
అమ్మ అస్తమయంతో తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను గుర్తుచేశారు సీఎం కేసీఆర్. అల్లం పద్మ భర్త అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి ఓదార్చి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్. అల్లం పద్మ అకాల మరణానికి జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర సంతాపం తెలిపాయి. ఆమె లేని లోటు తీర్చలేనిదని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!