ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…
దేశంలో రాజకీయాలను మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో భాగంగా కేసీఆర్ ఆదివారం ముంబై బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన…
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంపొందించే ప్రయత్నంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బస్తీ-మన బడి’కి అన్ని విధాలా సహకారం అందిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ‘మన బస్తీ– మన బడి’పై హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.7,289.54 కోట్లు కేటాయించాని…
నేడు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. సమావేశానికి హజరుకావాలని 240 మంది సభ్యులకు ఆహ్వానం పంపించారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత తొలిసారి సమావేశం కానున్నారు. నేడు సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్ కలువనున్నారు.…
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే…
నేను మేడం సోనియాకు లేఖ రాసిన క్షణం నుండి కాంగ్రెస్ గుంపులో నేను లేను అంటూ సంచలనం రేపారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాపై కోవర్ట్ అనే నింద వేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా నిందలు వేస్తున్నారు. నేను భరిస్తూ వుండాలా? తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపారు. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉంది. కాంగ్రెస్…
పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో బస్తీదవాఖానాలను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. బస్తీల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకు వైద్య సేనలు అందిస్తారు.ఉచితంగా వైద్య సేవలు, అన్ని…
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 1200కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 అక్టోబర్ 11 దసరా రోజున ప్రారంభమైన పనులు ఐదేళ్లలోనే పూర్తయ్యాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేశారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహణ వుంటుందని అంటున్నారు.…
ప్రయివేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు త్వరలో కొంత ఉపశమనం కలుగనుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోగా, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 21న మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా సబ్‌కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన…
దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అభివృద్ధి నీటిమీద రాతలాగా మారింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తులకు కనీస సదుపాయాలు అందడం లేదు. సౌకర్యాల కల్సనకు ఏటా 100 కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా అది అమలు కావడం లేదు. ఆలయ పీఠాధిపతులు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చట్టబద్ధత లేదు. ఆలయానికి చెందిన 20 కోట్లు…