నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని.. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… అమిత్‌షా హోంమంత్రి లెక్క మాట్లాడలేదు.. చౌకబారు నేత లెక్క మాట్లాడారంటూ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోపిడీ చేస్తే… హోం మంత్రిగా అమిత్ షా బాధ్యత మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు కేసీఆర్ అవినీతికి కంచే వేసి కాపాడుతుంది అమిత్ షానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించిన…
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని పేర్కొన్నారు.. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని.. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని…
తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్ మండి పడ్డారు. అమిత్ షా సభ తర్వాత TRS నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని ఎద్దేవ చేశారు. బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి, అసమర్థ , బాధ్యత రహిత్య మంత్రి కేటీఆర్ అంటూ మండి పడ్డారు. ఏసీబీ ట్రాప్…
అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ మీరు ఎంత మీ బ్రతుకు ఎంత… మీ స్థాయి ని మరిచి మాట్లాడున్నారు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కృష్ణా జలాశయాల్లో 570 టీఎంసీలు రావాల్సి వస్తే ఎందుకు 299 టీఎంసీలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మీరు ప్రాజెక్ట్ పేరుతో అప్పులు తెచ్చుకొని దోచుకుంటున్నారు. 2014…
అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ బహిరంగ సభతో కేసీఆర్ కు, కొడుకుకు నిద్ర పట్టడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేటీఆర్ ఒక పిచ్చి కుక్క .. అమెరికాలో బ్రతుకు దేరువు కోసం ఉద్యోగం చేశాడని, అమిత్ షా…
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం ఖమ్మంకు వెళ్లారు. సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి, సీఎంఓ కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు ఇచ్చే అదేశాల ప్రకారమే ఖమ్మం పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నా చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణం అంటూ సాయి చెప్పాడని .. మరణ వాంగ్మూలం తీసుకోవాలని డాక్టర్‌లు కుడా సమాచారం…
తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఇంతకుముందు వరంగల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ సమరానికి సై అన్నారు. తాజాగా బీజేపీ నేత, బాద్ షా అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మరోమారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ…
కష్టపడి వరి పండించిన రైతులను వర్షాలు పరేషాన్ చేస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నాడు…కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా మరికొన్నిచోట్ల తేమ పేరుతో ఆలస్యం కావడం కర్షకులకు కష్టాలు ఎదురౌతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్ల పరిస్థితి రైతులను ఆందోనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి..ముఖ్యంగా మంచిర్యాల ,నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు.ఈరెండు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి..అయితే మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల…
తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా పర్యటన విజయవంతం అయిందని బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటుంటే..విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. అమిత్ షా హైదరాబాద్ రాజకీయ పర్యటనపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. వొక్కసారి గెలిపించండి ప్లీజ్ అంటూ వీరోచితంగా పర్యటన సాగించి అమిత్ షాను ఆహ్వానించి అట్టహాసంగా బహిరంగసభ పెట్టి దీనంగా “వొక్కసారి ” అంటే వురి వొక్కసారే వేశారంటే చాలు రెండోసారికి అవకాశం వుండదు అన్నట్టుగా నారాయణ తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీని తెలంగాణాలో ఒక్కసారి…