మరోసారి టీఆర్‌ఎస్ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చల విడిగా పెరుగుతున్నాయని, తెలంగాణ కోసం పోరాడిన పేదొడు పేదొడిగానే మిగిలిపోయాడంటూ ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని, వంద కోట్ల విలువైన భూమిని ఎలా టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ భవన్‌కు కూత వేటు దూరంలో మళ్ళీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు…
జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయవచ్చనే అందోళన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు గల ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి బలం బీజేపీ, దాని మిత్రపక్షాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కనుక,…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. మంత్రి హరీష్‌రావు బుధవారం మాట్లాడుతూ.. బీజేపీ ఎందుకోసం యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలు పేదల…
ధాన్యం కొనుగోళ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 43 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 10 బాయిల్డ్.. 33 రా…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ.. ట్విట్టస్త్రాలు సంధించారు. వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట టీఆర్ఎస్ మరో లూటీకి తెర తీసిందంటూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్లర్‌లో ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు ఇప్పటికే తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందులో…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ధరణి వెబ్‌సైట్ రైతాంగానికి శాపంగా మారిందని ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందని, ల్యాండ్ పుల్లింగ్ పేరుతో భూములను గుంజు కుంటూ, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్ పని చేస్తోందని…
కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండలంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్‌ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు. రైతాంగం అధిక…
సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన కూడా సింగరేణిని ఇంకా దారిద్య్ర పరిస్థితికి కారణం కేసీఆర్ అనే ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆర్‌ఎస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించిందని, అయినా నాకు ఇంకో సారి తెలంగాణ కొరకు యుద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈటల…
ఇందిరా, పీవీలు ప్రధానిగా ఉన్నప్పుడు పేదలకు భూములు ఇచ్చారని జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాగీర్ దార్ల వద్ద 45 ఎకరాల కంటే ఎక్కువగా ఉండొద్దని చట్టం ఉందని, గతంలో.. 48 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారన్నారు. అంతేకాకుండా ఆ భూమిని.. కేవలం వ్యవసాయం చేసుకోవాలి, అమ్ముకోడానికి వీలులేదని క్లాజ్ పెట్టారన్నారు. అంత సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. వైఎస్సార్ కూడా తన తండ్రి…