NVSS Prabhakar:తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కొడుకుల వల్ల పురపాలక శాఖ భ్రష్టు పట్టి పోయిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్ మండి పడ్డారు. అమిత్ షా సభ తర్వాత TRS నేతలకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదని ఎద్దేవ చేశారు.
బంగారు గిన్నెలో జీవితం ప్రారంభించిన కేటీఆర్ కి పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత అవినీతి, అసమర్థ , బాధ్యత రహిత్య మంత్రి కేటీఆర్ అంటూ మండి పడ్డారు.
ఏసీబీ ట్రాప్ చేసిన వారిలో ఎక్కువ మంది పురపాలక శాఖ కు చెందిన ఉద్యోగులే వున్నారని విమర్శించారు. ఈయన మంత్రిత్వ శాఖలోనే కుంభకోణాలు చెవిచూసాయని విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాలచే ప్రశంసించబడుతున్న వ్యక్తి మోడీ అని తెలిపారు.
Also Read
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
ఆయననా మీరు విమర్శించేది అంటూ మండి పడ్డారు. కెసిఆర్ కేబినెట్ లో పనికి రాని, పని లేని మంత్రులు ఉన్నారని నిప్పులు చెరిగారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో అబద్దం ఏముంది? అని ప్రశ్నించారు. వంచించడం, మోసం చేయడం కెసిఆర్ కుటుంబానికే చెల్లిందని మండిపడ్డారు.
హాస్పిటల్స్ లో 5 రూపాయల భోజనం పెట్టాలనేది 8 సంవత్సరాల తర్వాత గుర్తుకు వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. బిజెపి నీ విమర్శిస్తే సహించేది లేదు… వెంట పడి తరిమి తరిమి కొడతాం అంటూ Nvss ప్రభాకర్ మండిపడ్డారు.
కాగా.. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణ పోలీసు వ్యవస్థపై, సీఎం కేసీఆర్ పై (మే-5)న సంచళన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా.. మూలాలు మాత్రం తెలంగాణలో..కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రవాద ఏమూల జరుగుతున్నా.. దాని మూలాలు మాత్రం తెలంగాణలో ఎందుకు ఉంటున్నాయో.. దీనికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలని నిలదీశారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారు తెలంగాణలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఎన్నో కేసులతో సంబందం ఉన్న MIM నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ప్రభుత్వం, పోలీసులే అని ఆరోపించారు. MIM నేతలను కాపాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ తెలీనట్లు నటిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ ఆగడాలను గమనిస్తోందని అన్నారు. త్వరలో ప్రజలే టిఆర్ఎస్ బుద్దిచెప్పే రోజులు వస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mim తో TRS మైత్రి తెలంగాణకు చాలా ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు. మే 14 సరికొత్త మార్పునకు పునాది కాబోతుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి అమిత్ షా వస్తున్నారని గుర్తు చేశారు. ఈసభలో కెసిఆర్ ను.. రైతు, యువజన, దళిత, బలహీన వర్గాల, తెలంగాణ ద్రోహిగా నిలబెట్ట బోతున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు.. కేసీఆర్ ను కాపాడలేవని ఎద్దేవ చేశారు. మధ్యంతరానికి అయిన, ముందస్తుకు అయిన మేము సిద్దంగా వున్నామని సవాల్ విశిరారు.
తాజావార్తలు
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!