అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ మీరు ఎంత మీ బ్రతుకు ఎంత… మీ స్థాయి ని మరిచి మాట్లాడున్నారు అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కృష్ణా జలాశయాల్లో 570 టీఎంసీలు రావాల్సి వస్తే ఎందుకు 299 టీఎంసీలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మీరు ప్రాజెక్ట్ పేరుతో అప్పులు తెచ్చుకొని దోచుకుంటున్నారు. 2014 నుంచి 22 దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం 69 వేల కోట్లు పెట్రోల్, డీజిల్ రూపంలో టాక్స్ వసూలు చేసిందని, కేటీఆర్ మీ అయ్యా్కు దమ్ముంటే నిన్ను ముఖ్యమంత్రిని చేయమను అని ఆమె సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఉండరని, పోలీస్ వ్యవస్థను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
మీకు దమ్ముంటే పోలీస్ లేకుండా ఊర్లో తిరుగండని, చాలా మందికి పింఛను ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. అంత ప్రజల సొమ్ము… మీ ఇంట్ల కెళ్ళి ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్నారు… కేసీఆర్, కేటీఆర్ భాష తీరు మార్చుకోవాలి… తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు… ఫామ్ హౌస్ కు నీళ్లు తరలించేందుకు ప్రాజెక్ట్‌ల పేరుతో కోట్ల అప్పు చేశారు… తెలంగాణను దోచుకుంటోంది మీ కుటుంబం.. మీ మీద మీకు నమ్మకం లేక పీకేని తేచ్చుకుంటున్నారని ఆమె విమర్శించారు.