నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని.. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు పొందారని ఆగ్రహించారు. ఫామాయిల్ పంట సాగు లాభదాయకం, నేను కూడా 20ఎకరాలు సాగుచేశానని తెలిపారు. రైతు కోఆర్డినేటర్ లకు అధికారులు ఇవ్వాలని కోరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే కొందరు తప్పుదోవ పట్టించారని మండి పడ్డారు. సీటీల్లో మిద్దెలపై అనేక రకాల పంటలు వేస్తున్నారు… మన దగ్గర ఎందుకు సాగుచేయలేకపోతున్నామని మంత్రి అన్నారు. మిర్చికి క్వింటాల్ కు 54వేల రూపాయల ధర పలికిందని.. ఎంత వరి వేస్తే 54వేలు వస్తాయన్నారు. అందుకే ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలని.. నూతన విధానాలు అవలంభించాలని పేర్కొన్నారు.
అనంతరం జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, శివ లింగయ్య, శశాంక్, నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Vijay Devarakonda: ఖుషి’ విజయ్ దేవరకొండకు ఖుషీని ఇస్తుందా!?